తెలంగాణ

telangana

ETV Bharat / crime

Live Video: అందరూ చూస్తుండగానే రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య

Suicide: రోడ్డు కానీ, రైల్వే ట్రాక్​ కానీ దాటేటప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా దాటుతుంటాం. అటు నుంచి రైలు రావట్లేదని తెలిసి కూడా భయంభయంగా దాటేందుకు యత్నిస్తాం. కానీ ఈ యువకుడు మాత్రం అంతవరకూ స్టేషన్​లో తచ్చాడుతూ సరిగ్గా ప్లాట్​ఫాం మీదకు ట్రైన్​ వచ్చే సమయానికి ట్రాక్​ మీదకు దిగాడు. సడెన్​గా పరిగెత్తడం స్టార్ట్​ చేశాడు. పట్టాలు దాటేందుకు సాహసం చేస్తున్నాడేమో అని అక్కడున్న ప్రయాణికులు అనుకుని వెనక్కి రమ్మంటూ అరుస్తున్నారు. కానీ ఇంతలోనే ఒక్కసారిగా రైలు వస్తున్న పట్టాలపై కళ్లు మూసుకుని పడుకున్నాడు. కళ్లు మూసి తెరిచేలోపు.. అతని శరీరం ఛిద్రమైపోయింది. అప్పటికి గానీ అర్థం కాలేదు అక్కడున్న వారికి.. ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని..

suicide at railway station
రైలు కింద పడి ఆత్మహత్య

By

Published : Mar 13, 2022, 10:21 AM IST

Suicide: ఆ యువకుడికి ఏ కష్టం వచ్చిందో ఏమో ప్రయాణికులు చూస్తుండగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకుందామని రైల్వే స్టేషన్​కు రాత్రి వచ్చిన యువకుడు.. ధైర్యం చాలక అలాగే ఉండిపోయాడు. అక్కడ ప్రయాణికులు ఉండటంతో వాళ్లు ఆపుతారని భయపడ్డాడో ఏమో.. సమయం కోసం ఎదురుచూశాడు. అందరిలాగే అటూఇటూ తిరిగాడు. తీరా తెల్లవారింది. ఇక చనిపోదామని నిర్ణయించుకున్నాడు. సమయం కోసం చూశాడు. అంతలోనే ట్రాక్​పైకి అతివేగంతో రైలు వచ్చింది. అంతే ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్లి దాని కిందపడిపోయాడు. ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

అందరూ చూస్తుండగానే రైలు కింద పడి ఆత్మహత్య

సీసీ కెమెరాల్లో దృశ్యాలు

గుర్తుతెలియని యువకుడు (25) తునిలో హాల్టులేని నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి బలవన్మరణం చెందడం చూపరులను తీవ్రంగా కలచివేసింది. ఈ సంఘటన రైల్వే స్టేషన్​లోని 1వ నెంబరు ప్లాట్​ఫాంపై చోటుచేసుకుంది. ఆ దృశ్యాలు ప్లాట్​ఫాం వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని

అంతవరకూ ప్లాట్‌ఫాంపై అటూఇటూ తిరుగుతూ ఉన్న ఆ యువకుడు.. రైలు రాకను గమనించి పట్టాలపైకి దిగి, ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని రైలుకింద పడిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆ యువకుడు రాత్రి నుంచి స్టేషన్‌ పరిసరాల్లోనే తిరుగుతున్నట్లు స్థానికుల ద్వారా తెలిసిందని పోలీసులు చెప్పారు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలూ లభించలేదని వెల్లడించారు.

ఇదీ చదవండి:Three died: ఒకే రోజు.. ఒకే రైలు.. ముగ్గురు మృతి..

ABOUT THE AUTHOR

...view details