Man killed His Wife and Mother in Law: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలంలోని జాలవాడిలో నాగరాజు అనే వ్యక్తి.. భార్య శాంతి(25), అత్త భీమక్క(48)ను వేటకొడవలితో నరికి హత్య చేశాడు. మద్యం తాగుతున్న నాగరాజును.. భార్య, అత్త మందలించడంతో గొడవపడి తెల్లవారుజామున హత్య చేసి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. నాగరాజు, శాంతికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. మద్యం పచ్చని కుటుంబంలో చిచ్చు రేపింది.
మద్యం తాగొద్దని మందలించిన భార్య, అత్త.. వేటకొడవలితో నరికి చంపిన కిరాతకుడు - Andhra Pradesh Latest News
Man killed His Wife and Mother in Law: మద్యం తాగొద్దని అత్త, భార్య గత కొంత కాలంగా మందలిస్తూ వస్తున్నారు. ఆరోజు కూడా అలాగే చెప్పారు. దీంతో గొడవ జరిగింది. ఇక అంతే.. వేటకొడవలితో భార్యను, అత్తను అతికిరాతంగా నరికాడు. వెంటనే అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
murder