Murder in palnadu: పల్నాడు జిల్లా నరసరావుపేటలో.. శుక్రవారం కిడ్నాపైన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. నరసరావుపేటలో శుక్రవారం మధ్యాహ్నం ఓ నగల దుకాణంలోకి వచ్చిన కొందరు వ్యక్తులు.. అక్కడే పనిచేస్తున్న రామాంజనేయులును కొట్టుకుంటూ బలవంతంగా ఆటోలో తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. తన భర్తను కిడ్నాప్ చేశారని రామాంజనేయులు భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంగం బాజి అనే వ్యక్తి సహా మరికొందరు షాపులోనికి వచ్చి తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కానీ.. శుక్రవారం కిడ్నాప్‌నకు గురైన రామాంజనేయులు.. శనివారం మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని దుండగులు ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద జాతీయ రహదారి వంతెన కింద గోతం సంచిలో కట్టి పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానిక చేరుకుని క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. మృతుని భార్య ప్రసన్నలక్ష్మి, కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.