తెలంగాణ

telangana

ETV Bharat / crime

ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి - mannanur accident latest news

ద్విచక్రవాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి గాయాలైన ఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

By

Published : May 10, 2021, 10:11 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం మన్ననూర్ సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం అదుపుతప్పి చిన్న రంగారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. జమ్ములదిమ్మె చిన్న రంగారెడ్డి వృత్తిరీత్యా ఆమ్రాబాద్ మండలం ఈగలపెంట జెన్​కోలో పని చేస్తున్నాడు. ఆదివారం అతనికి పంటినొప్పి రావటంతో కుమారుడు రఘువర్మారెడ్డితో కలిసి అచ్చంపేటకు వచ్చి చికిత్స చేయించుకున్నారు.

తిరుగు ప్రయాణంలో మన్ననూర్కోసమీపంలో కోతి అడ్డురావడంతో దానిని తప్పించబోయారు. ఈ క్రమంలోనే బైక్​ అదుపుతప్పి కిందపడిపోయారు. ఘటనలో తండ్రి రంగారెడ్డికి తీవ్ర గాయాలు కాగా.. కుమారుడు రఘువర్మారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన రంగారెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి.. అక్రమంగా నిల్వ ఉంచిన పటిక, నిషేధిత గుట్కా స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details