తెలంగాణ

telangana

ETV Bharat / crime

LIVE VIDEO: గుండెపోటుతో ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్లాడు.. అక్కడే కుప్పకూలాడు!

గుండెపోటు వచ్చిన ఓ వ్యక్తి ఆస్పత్రి వరకు నడుచుకుంటూ వెళ్లాడు. అంతేకాదు ఆస్పత్రి సిబ్బందికి తన పరిస్థితిని వివరించాడు. తీరా వార్డు వరకు వెళ్లి అక్కడ కుప్పకూలిపోయాడు. అనంతరం సిబ్బంది అతనిని బతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

LIVE VIDEO: గుండెపోటుతో ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్లాడు.. అక్కడే కుప్పకూలాడు
LIVE VIDEO: గుండెపోటుతో ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్లాడు.. అక్కడే కుప్పకూలాడు

By

Published : Jan 10, 2022, 9:28 PM IST

LIVE VIDEO: గుండెపోటుతో ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్లాడు.. అక్కడే కుప్పకూలాడు

"చావు చెప్పి వస్తదా...? పాణం పోవుడు ఎంతసేపు..." ఈ మాటలు వింటే నిజమే అనిపిస్తుంది హైదరాబాద్​లోని నాగోల్​లోని సుప్రజ ఆస్పత్రిలో జరిగిన ఘటన చూస్తే. చూస్తుండగానే ఓ వ్యక్తి ఆస్పత్రిలోనే కుప్పకూలిపోయాడు. స్వల్పంగా గుండెపోటు రావడంతో చైతన్యపురికి చెందిన మోరు యాదగిరి(38) అనే వ్యక్తి దగ్గరలోని సుప్రజ ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్లాడు. ఆ నొప్పిని భరిస్తూనే ఆస్పత్రిలోని సిబ్బందికి విషయాన్ని చెప్పాడు. ఆస్పత్రి సిబ్బంది అతన్ని ఆస్పత్రిలో అడ్మిట్​ చేసుకోవడానికి వార్డులోకి తీసుకెళ్లారు. వార్డులోకి వెళ్లిన కాసేపటికే యాదగిరి కుప్పకూలిపోయాడు. అనంతరం సిబ్బంది అతనిని బతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు.

నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని ఆందోళన

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే యాదగిరి చనిపోయాడని బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. 20 నిమిషాల వరకు చికిత్స అందించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. సరైన వైద్యులు లేకుండా ఆస్పత్రిని నిర్వహిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకుని, ఆస్పత్రిని సీజ్ చేయాలని మృతుని బంధువులు అన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

'ఆస్పత్రికి ఛాతినొప్పి అని వచ్చాడు. వార్డు లోపలి వరకు నడుచుకుంటూ వెళ్లాడు. లోపలికి వెళ్లగానే కిందపడిపోయాడు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మా అన్నయ్య చనిపోయాడు.' -చిన్న, మృతుడి తమ్ముడు

ఇదీ చదవండి:

AR Constable Suicide : నిశ్చితార్థానికి ముందు కానిస్టేబుల్ ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details