తెలంగాణ

telangana

ETV Bharat / crime

jackfruit: పనసకాయ కోస్తుండగా మీద పడి... - ap news

పనస చెట్టుకున్న కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు పనసకాయ మీద పడి ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగింది.

jackfruit
jackfruit

By

Published : Jul 4, 2021, 9:30 AM IST

చెట్టుకున్న పనస కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాయ మీద పడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం ఈ ఘటన జరిగింది. స్థానిక వెంకటేశ్వర కాలనీకి చెందిన మాజీ కౌన్సిలర్‌, వ్యాపారవేత్త మాటూరి నారాయణమూర్తి (66) తన ఇంటి పెరట్లో ఉన్న పనస చెట్టు కాయలు కోయిస్తూ.. అవి కిందపడకుండా గోనె సంచి పట్టుకుంటున్నారు. ఆ సమయంలో చెట్టుపై నుంచి ఓ కాయ నారాయణమూర్తి ముఖంపై పడటంతో అదుపుతప్పి వెనక్కి పడిపోయారు.

సిమెంట్‌ రోడ్డుకు తల బలంగా తగలడంతో తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం తొలుత పాలకొల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి భీమవరం తరలించేందుకు వాహనం ఎక్కిస్తుండగా తుదిశ్వాస విడిచాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఇదీ చూడండి:ACCIDENT: అతివేగంతో ప్రయాణం.. అదుపుతప్పి ముగ్గురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details