తెలంగాణ

telangana

ETV Bharat / crime

'యువతిని గర్భవతిని చేసి.. అలా చేస్తే పెళ్లి చేసుకుంటానన్నాడు' - man cheats his girl friend in rangareddy district

Man cheats his girlfriend : తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని ఓ యువతి ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిలో చేరింది. ఈ క్రమంలోనే ఆ ప్రెస్ యజమానితో ఆమెకు చనువు ఏర్పడింది. ఆమె అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని అతడు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. తీరా గర్భవతి అయ్యాక పెళ్లి చేసుకోమని కోరితే ఓ షరతు విధించాడు.

Man cheats his girlfriend
Man cheats his girlfriend

By

Published : Apr 9, 2022, 11:56 AM IST

Man cheats his girlfriend : ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేసే ఓ యువతితో శారీరక సంబంధం పెట్టుకున్న యజమాని ఆమె గర్భవతి కాగానే ముఖం చాటేశాడు. ఆమె బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు అతణ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ పాతబస్తీ మంగళ్‌హాట్‌కు చెందిన ఓ యువతి.. అత్తాపూర్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన విగ్నేశ్వర ప్రింటింగ్ ప్రెస్‌లో గత ఆరు నెలలుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో శ్రీనివాస్‌కు ఆమెకు మధ్య చనువు పెరిగింది. అది కాస్త శారీరక సంబంధానికి దారితీసింది. తను గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని శ్రీనివాస్‌ను కోరింది. ముందు అబార్షన్ చేయించుకోమని.. తర్వాత పెళ్లిచేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అది నమ్మిన ఆ యువతి అబార్షన్‌కు ఒప్పుకుంది. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు అబార్షన్ చేయించాడు శ్రీనివాస్. ఈ క్రమంలో ఆమెకు రక్తస్రావం ఎక్కువ కావడంతో విషయం యువతి ఇంట్లో తెలిసింది. అబార్షన్ చేయించిన తర్వాత అడిగితే శ్రీనివాస్ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఆమె తన బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన అత్తాపూర్‌ పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details