అక్రమంగా సేకరించిన విత్తనాలు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ విజయనగర్ కాలనీకి చెందిన అనుగు చంద్రశేఖర్ స్థానిక హైదర్‌నగర్‌లోని పీఎస్ నగర్‌లో పావని హైబ్రీడ్ పేరిట విత్తనాలు విక్రయించే కేంద్రం నడుసుతున్నాడు. పత్తి, కందులు, సొరకాయ, జొన్నలు తదితర 21 రకాల విత్తనాలు ఎటువంటి అనుమతులు లేకుండా అమ్ముతున్నట్టు గుర్తించిన వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా అతని కేంద్రంపై దాడి చేశారు.
illegal seeds: విత్తనాలు అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్‌లో విత్తనాలు అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 21 రకాల విత్తనాలు ఎటువంటి అనుమతులు లేకుండా అమ్ముతున్నట్టు గుర్తించారు.
illegal seeds
తనిఖీల్లో ఎటువంటి అనుమతులు లేకుండా విత్తనాలు విక్రయ కేంద్రం కొనసాగిస్తున్నట్లు తేలింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.