మేడ్చల్ జిల్లాలో పట్టుబడ్డ రూ.2 కోట్ల విలువైన మాదకద్రవ్యాల కేసులో(Medchal Mephedrone drug case) తప్పించుకుని తిరుగుతున్న ప్రధాన నిందితుడు సుకేశ్ రెడ్డి ఎల్బీనగర్ కోర్టులో మంగళవారం లొంగిపోయాడు. ఇటీవలె రూ.2 కోట్ల విలువైన సుమారు 5 కిలోల మెఫిడ్రిన్ డ్రగ్స్‌ను మేడ్చల్‌లో పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా బావాజీపల్లికి చెందిన హన్మంత్‌రెడ్డి ఎల్బీనగర్ కోర్టులో లొంగిపోయాడు. కేసులో నిందితులైన హన్మంత్‌రెడ్డితో పాటు రామకృష్ణను కస్టడీలోకి తీసుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు… వారి నుంచి పలు వివరాలు సేకరించారు. అనంతరం, సూత్రధారి, ప్రధాన నిందితుడైన సుకేశ్‌రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే సుఖేశ్‌రెడ్డి… ఎల్బీనగర్ కోర్టులో లొంగిపోయాడు. రసాయన శాస్త్రంలో అనుభవజ్ఞుడైన సుకేశ్‌రెడ్డి… ముడి సరుకును సేకరించి పఠాన్‌చెరు ఇస్నాపూర్ ప్రాంతంలో మాదకద్రవ్యాలను తయారు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ చింతల్‌లో ఉంటూ ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. లొంగిపోయిన సుకేశ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశముంది.
ఇదీ చూడండి:Medchal Mephedrone drug case: కొనసాగుతున్న వేట.. ఆ ఐదు ఇళ్లలో సోదాలు!