Maid stole gold in nacharam: ఇంట్లో పనిచేయడానికి పెట్టుకున్నందుకు చివరికీ యజమానురాలు ఇంటికే కన్నం వేసింది ఓ పనిమనిషి. నమ్మకంగా ఉంటుందని కాస్త నిర్లక్ష్యంగా ఉన్నారు. దాంతో ఒకరోజు వృద్ధురాలైన యజమానురాలు అనారోగ్యానికి గురైతే.. అదే అదునుగా భావించి ఆమె కళ్లు పోగొట్టి దొంగతనానికి పాల్పడింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా నాచారంలో జరిగింది.
అసలేం జరిగిందంటే...
వృద్ధురాలైనా యజమానురాలు హేమావతి కుమారుడు శశిధర్ లండన్‌లో ఉంటాడు. గత ఏడాది భార్గవికి నెలకు 15 వేల జీతం ఇచ్చి ఇంట్లో పనికి పెట్టి వెళ్లాడు. ఆదిలాబాద్ మందమర్రి నుంచి వచ్చిన ఆమె ఇంట్లో గొడవలతో భర్తకు దూరంగా ఉంటుంది. ఒకరోజు యజమానురాలు కళ్లకి సమస్య వచ్చి కంటి ఆసుపత్రి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన పనిమనిషి కంటి మందుకు బదులుగా.. బాత్రూం క్లీనర్లో జండు బామ్, నీళ్లు కలిపి రోజుకి ఒకసారి చొప్పున నాలుగు రోజులు వృద్ధురాలి కళ్లలో వేసింది. చివరికీ యజమానురాలు కళ్లు పోవడంతో ఇంట్లో ఉన్న 6 తులాల బంగారం, 40వేల నగదును దొంగతనం చేసింది.