తెలంగాణ

telangana

ETV Bharat / crime

పెళ్లైన వ్యక్తితో యువతి ప్రేమాయణం.. ఒకరినొకరు విడిచి ఉండలేక ఆత్మహత్య - ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

Lovers Suicide: సిద్ధిపేట జిల్లా ములుగు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొండపోచమ్మ జలాశయం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

lovers
అటవీ ప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య

By

Published : Sep 10, 2022, 2:24 PM IST

Lovers Suicide:సిద్ధిపేట జిల్లా ములుగు మండలం పరిధిలో ఓ ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు మండలం మామిడాల పునరావాస కాలనీకి చెందిన గొట్టి మహేశ్​​ (29)కు ఏడేళ్ల కిందట మర్కుక్ మండలం భవనందపూర్​కు చెందిన కృష్ణవేణితో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. మహేశ్​ ఆటో నడుపుతూ... కూలీ పనులకు వెళ్తూ జీవనం కొనసాగించేవాడు. ఆటో నడుపుతున్న క్రమంలో ఆరునెలల కిందట మర్కుక్ మండల కేంద్రానికి చెందిన యువతితో(19) పరిచయం ఏర్పడింది. అలా రోజు మాట్లాడటంతో... అది కాస్త ప్రేమగా మారింది.

Lovers Suicideపెళ్లైన వ్యక్తితో యువతి ప్రేమాయణం

వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇంట్లో నుంచి వెళ్లి పోయారు. ఇరువురిపై సంబంధిత పోలీస్ స్టేషన్​లో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ల ఇంటికి పంపించారు. అయిన వారిలో మార్పు రాకపోవడంతో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం ఇరువురు ములుగు మండలంలోని కొండపోచమ్మ జలాశయం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లి తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని బంధువులకు ఫోన్ చేసి చెప్పారు. అన్నట్టుగానే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించామని ములుగు ఎస్​ఐ రంగ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details