Lovers Suicide: నిర్మల్లో ప్రేమజంట ఆత్మహత్య - nirmal district news
11:49 June 30
నిర్మల్లో ప్రేమజంట ఆత్మహత్య
పెద్దల పంతానికి మరో ప్రేమ జంట బలైపోయింది. కులం.. ఇంకో ఇద్దరు ప్రేమికుల ఉసురు తీసింది. ఇద్దరి కులాలు వేరైనందు వల్ల పెద్దలు వారి పెళ్లికి అంగీకరించలేదు. విడిపోయి బతకలేక.. కలిసి ఉండే అవకాశం లేక మనస్తాపానికి గురైన ఆ ప్రేమికులు.. బలవన్మరణానికి పాల్పడ్డారు.
నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన హరీశ్, నిక్షిత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడం వల్ల ప్రేమ విషయం పెద్దలకు తెలిస్తే పెళ్లికి అంగీకరించరనే భయంతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆత్మహత్య చేసుకుంటున్నామని హరీశ్.. వాట్సాప్ స్టేటస్ పెట్టాడు. ఇది గమనించిన మిత్రులు గాలించగా ఇంట్లో ఉరేసుకుని కనిపించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు..
- ఇదీ చదవండి : వైఎస్ షర్మిల ఇంటిముందు అమరావతి పరిరక్షణ సమితి ధర్నా