LOVERS SUICIDE: రెండురోజుల వ్యవధిలో ప్రేమజంట ఆత్మహత్య - తెలంగాణ వార్తలు
11:27 August 07
ప్రేమజంట ఆత్మహత్య
ఇద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నారు. కలిసి ఉంటే ఎంత సంతోషంగా గడుపుతామో అంటూ ఊసులు చెప్పుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో... చివరికి ఇద్దరు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డలో విషాదం చోటు చేసుకుంది. రెండురోజుల వ్యవధిలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. గురువారం యువతి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా... ప్రియురాలి మరణాన్ని యువకుడు తట్టుకోలేకపోయాడు. ప్రేయసి ఆలోచనల నుంచి బయటకు రాలేక తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. నిన్న పురుగుల మందు తాగి పవన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువతి ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు ఇంకా తెలియనట్లు పోలీసులు తెలిపారు.