భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో కొన్నిరోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు (couple Suicide attempt in yellamdhu). యువతి మృతి చెందగా.. యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నెహ్రూ నగర్తండాకు చెందిన శ్వేత(21), కట్టుగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్(24) పది రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
Couple Suicide Attempt in yellamdhu: పెళ్లైన తర్వాత బయటపడిన అన్నాచెల్లి బంధం.. యువతి మృతి - భద్రాద్రిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
09:01 September 21
పెళ్లైన తర్వాత బయటపడిన అన్నాచెల్లి బంధం.. యువతి మృతి
పెళ్లి అనంతరం యువకుడి కులం తెలిసి... తనకు సోదరుడి వరస అవుతాడని... మనస్తాపంతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంకటేశ్ కూడా పురుగుల మందు తాగి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. స్థానికులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
తమ బిడ్డను మోసం చేసి పెళ్లి చేసుకుని ఆత్మహత్య చేసుకునేలా చేశాడని.. యువతి తరఫు బంధువులు యువకుడి ఇంటిపై దాడికి యత్నించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
కట్టుగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్.. తన కులంపేరు మార్చి చెప్పి.. ప్రేమ పేరుతో మోసం చేసి మా అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత అన్న వరస అవుతాడని తెలిసి మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మాకు న్యాయం జరగాలి. -మృతురాలి బంధువు .
ఇదీ చూడండి:Lovers suicide attempt: పెద్దలు ఒప్పుకోలేదని.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం