తెలంగాణ

telangana

ETV Bharat / crime

Love Couple Suicide Attempt: గుడిలో పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. - love couple attempted suicide and boy died in thadway mandal

Love Couple Suicide Attempt: ఇద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. చెట్టాపట్టాలేసుకు తిరిగారు. కలిసి బతకాలనుకున్నారు. కానీ ఇంతలో ఏమైందో ఏమో.. ఈ లోకాన్ని విడిచి వెళ్లాలనుకున్నారు. చావుకు సిద్ధపడ్డారు. అందుకు పురుగుల మందు కూడా సిద్ధం చేసుకున్నారు. దేవుని సన్నిధిలో మరణిస్తే ఆత్మహత్యాపాపం అంటుకోదని భావించారేమో.. లేక మరి వచ్చే జన్మలోనైనా కలిసి ఉండాలని మొక్కుకున్నారేమో.. భగవంతుని దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలోనే ఆత్మహత్యకు యత్నించారు. ఘటనలో యువతి చనిపోగా.. ప్రియుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో ఈ విషాదం చోటుచేసుకుంది.

love couple suicide attempt
తాడ్వాయిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

By

Published : Mar 10, 2022, 10:05 AM IST

Love Couple Suicide Attempt: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ప్రేమజంట పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించింది. ఘటనలో ప్రియురాలు మృతి చెందగా.. ప్రియుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఘటనతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

ఒకే గ్రామానికి చెందిన ప్రేమికులు

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలంలోని ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన భీమన్నగారి పోచయ్య, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో చిన్న కుమారుడు నందీశ్వర్‌. గత కొంత కాలంగా హైదరాబాద్‌లో ప్రింటర్స్‌ మరమ్మతుల పని నేర్చుకుంటున్నాడు. ఇతను తన గ్రామానికి చెందిన ఓ యువతి(18)ని ప్రేమిస్తున్నాడు. బుధవారం వీరిద్దరూ తాడ్వాయిలోని హనుమాన్‌ ఆలయం వద్దకు వచ్చి శీతలపానీయంలో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

ప్రాణాపాయ స్థితిలో

ఆలయ ప్రాంగణంలో వీరిని గమనించిన స్థానికులు.. ఆటోలో కామారెడ్డి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. నందీశ్వర్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో కామారెడ్డిలోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. యువతి తూఫ్రాన్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దలు పెళ్లికి అంగీకరించరేమోనని వీరిద్దరూ పురుగుల మందు తాగినట్లుగా స్థానికులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:శ్రుతిమించిన రుణయాప్​ల ఆగడాలు.. మహిళ ఫోన్​ నంబర్​ను 500 మందికిచ్చి వేధింపులు

ABOUT THE AUTHOR

...view details