యాదాద్రి భువనగిరిజిల్లా ఇందిరానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. యాదాద్రిలోని ఎల్బీనగర్కి చెందిన కౌలురైతు రామస్వామి వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు టీవీఎస్ లూనా మీద బయలుదేరాడు.
టీవీఎస్ లూనాను ఢీకొట్టిన లారీ... కౌలు రైతు మృతి - వ్యక్తి మృతి
భువనగిరిలోని ఇందిరానగర్ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కౌలురైతు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టీవీఎస్ లూనాను ఢీకొట్టిన లారీ... కౌలు రైతు మృతి
ఇందిరానగర్ వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ... లూనాను ఢీకొట్టింది. ఈ ఘటనలో రామస్వామి లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.