ఇసుక లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచ్చయ్యపల్లికి చెందిన నర్సింహ, మారేడు మల్లేశ్ ద్విచక్రవాహనంపై తమ స్వగ్రామానికి బయలుదేరారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ... ఇద్దరు మృతి - శామీర్‌పేట వార్తలు
అతివేగంగా వచ్చిన ఇసుక లారీ... ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణ చెందారు. లారీ యువకుల మీద నుంచి వెళ్లడంతో శరీరభాగాలు నుజ్జునుజ్జయ్యాయి.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ... ఇద్దరు మృతి
శామీర్‌పేట మండలం తుర్కపల్లి గ్రామ పరిధిలోని క్లాసిక్ దాబా వద్దకు రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఇసుక లారీ బైక్ను ఢీకొంది. లారీ వారిపై నుంచి వెళ్లడంతో శరీర భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఎస్సై తెలిపారు.
ఇదీ చూడండి:అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం