Medchal road accident : కారును ఢీకొట్టిన లారీ.. క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు - lorry hits car in dundigal
08:13 November 18
కారును ఢీకొట్టిన లారీ
మేడ్చల్ జిల్లా(medchal district) దుండిగల్ పరిధిలోని సూరారం కట్టమైసమ్మ చెరువు వద్ద బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం(Medchal road accident) చోటుచేసుకుంది. గండి మైసమ్మ నుంచి జీడిమెట్ల వైపు వెళ్తున్న కారును వెనక నుంచి ఓ లారీ(lorry hits car) ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీలో ఉన్న సామగ్రి కారుపై పడిపోయింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఆ సామగ్రి ఎక్కువ బరువు లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని.. దారిపొడవునా సామగ్రి పడిపోతున్నా పట్టించుకోకుండా డ్రైవింగ్ చేశాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.