టోల్‌గేట్ వద్ద వేరుశనగ కాయలు అమ్మే మహిళను ఓ లారీ క్లీనర్ మద్యం మత్తులో బలితీసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం టోల్ గేట్ వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదం హృదయాలను కలచివేసింది. టోల్ ప్లాజా వద్ద వేరుశనగ కాయలు అమ్మే ఇద్దరు మహిళలు నిలబడి ఉండగా.. ఒక్కసారిగా లారీ వారిపైకి దూసుకెళ్లింది.
లైవ్ వీడియో: మహిళపై దూసుకెళ్లిన లారీ - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం టోల్ గేట్ వద్ద ప్రమాదం జరిగింది. వేరుశనగ కాయలు అమ్మే ఇద్దరు మహిళలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ లారీ - సిమ్మెంట్ దిమ్మెల మధ్య ఇరుక్కొని అక్కడికక్కడే మరణించింది.
రోడ్డు ప్రమాదం
ఒక మహిళ తప్పించుకోగా.. సూరమ్మ (40) అనే మరో మహిళ... లారీ - సిమెంట్ దిమ్మెల మధ్య ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. మద్యం మత్తులో లారీ క్లీనర్ లారీ నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:అడ్డు వస్తున్నాడని పసివాడి ప్రాణాలు తీశాడు