కరీంనగర్ జిల్లా గంగాధర చౌరస్తాలో పోలీస్ కంట్రోల్ రూంను గ్రానైట్ లారీ ఢీకొట్టింది. గ్రానైట్ రాళ్ల లోడుతో కరీంనగర్ వైపు వెళ్లేందుకు మూల మలుపు వద్దకు రాగా… లారీ అదుపు తప్పడం వల్ల ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కంట్రోల్ రూం నేలమట్టమై… విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
పోలీస్ కంట్రోల్ రూంను ఢీకొన్న గ్రానైట్ లారీ - తెలంగాణ వార్తలు
కరీంనగర్లో పోలీస్ కంట్రోల్ రూంను గ్రానైట్ లారీ ఢీకొంది. భారీ వర్షంతో దారి కనిపించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. సమయానికి పోలీస్ సిబ్బంది అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.
కంట్రోల్ రూంను ఢీకొన్న లారీ, రోడ్డ ప్రమాదం
ఘటన సమయంలో పోలీస్ సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం తప్పిందని పోలీసులు అన్నారు. భారీ వర్షం కురవడం వల్ల దారి కనిపించక ప్రమాదం జరిగినట్టు తెలిపారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:LOCKDOWN: రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగింపు