ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాల(పీటీసీ) క్వార్టర్స్‌లో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత మహిళా ఎస్సై కె.భవాని(25) ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో ఎస్సైగా పని చేస్తున్న భవాని.. క్రైమ్ శిక్షణ నిమిత్తం ఐదురోజుల క్రితం విజయనగరం వచ్చారు. శనివారం మధ్యాహ్నానికి శిక్షణ పూర్తయింది. ఆదివారం ఆమె తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది. ఈ క్రమంలో భవాని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. భవానీ 2018 బ్యాచ్‌కు చెందిన అధికారిణి.
SI Suicide: శిక్షణ పూర్తి చేసుకున్న రోజే మహిళా ఎస్సై ఆత్మహత్య - మహిళా ఎస్సై ఆత్మహత్య
మహిళా ఎస్సై బలవన్మరణానికి పాల్పడింది. క్రైమ్ శిక్షణ పూర్తి చేసుకున్న రోజే.. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై ఆత్మహత్యకు వ్యక్తిగత ఇబ్బందులా? లేక ఉద్యోగంలో సమస్యలు కారణమా అనేది తెలియాల్సి ఉంది.
si Suicide
ఆమె స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం. విశాఖపట్నంలో ఉన్న సోదరుడు శివకు చివరిసారి ఫోన్ చేసి శిక్షణ పూర్తయిపోయినట్లు చెప్పిందని తెలిసింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని విజయనగరం డీఎస్పీ పి.అనిల్‌కుమార్ తెలిపారు. ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: Brutal Murder: ఏపీలో దారుణం.. తల్లీకుమార్తెల హత్య