తెలంగాణ

telangana

ETV Bharat / crime

ED Arrest NBFC CEO: రూ.10 కోట్ల నికర నిధితో రూ.2,224 కోట్ల లావాదేవీలు - తెలంగాణ వార్తలు

ED Arrest NBFC CEO : కుడోస్‌ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ సీఈవో పవిత్ర ప్రదీప్‌ వాల్వేకర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శనివారం అరెస్ట్‌ చేసింది. ఈయనకు హైదరాబాద్‌ పీఎంఎల్‌ఏ ప్రత్యేక న్యాయస్థానం 15 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. మొబైల్‌ యాప్‌ల ద్వారా వ్యక్తిగత సూక్ష్మరుణాలు ఇస్తున్న ఫిన్‌టెక్‌ కంపెనీల అక్రమ కార్యకలాపాలపై ఈడీ సాగిస్తున్న దర్యాప్తులో భాగంగా కుడోస్‌ కార్యకలాపాలపై దృష్టి సారించడంతో బండారం బహిర్గతమైంది.

ED Arrest NBFC CEO, kudos non banking finance company
కుడోస్‌ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ సీఈవో పవిత్ర ప్రదీప్‌ వాల్వేకర్‌ అరెస్ట్

By

Published : Dec 19, 2021, 7:37 AM IST

ED Arrest NBFC CEO : చైనా కంపెనీల నిధులతో అక్రమంగా సూక్ష్మరుణ వ్యాపారాలు నిర్వహించేందుకు సహకరించిన కుడోస్‌ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) సీఈవో పవిత్ర ప్రదీప్‌ వాల్వేకర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శనివారం అరెస్ట్‌ చేసింది. ఈయనకు హైదరాబాద్‌ పీఎంఎల్‌ఏ ప్రత్యేక న్యాయస్థానం 15 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. మొబైల్‌ యాప్‌ల ద్వారా వ్యక్తిగత సూక్ష్మరుణాలు ఇస్తున్న ఫిన్‌టెక్‌ కంపెనీల అక్రమ కార్యకలాపాలపై ఈడీ సాగిస్తున్న దర్యాప్తులో భాగంగా కుడోస్‌ కార్యకలాపాలపై దృష్టి సారించడంతో బండారం బహిర్గతమైంది. వినియోగదారులను గుర్తించి రుణ అర్హత కనిపెట్టడం దగ్గరి నుంచి రుణవాయిదాల వసూళ్ల వరకు పలు ఫిన్‌టెక్‌(డిజిటల్‌ రుణ భాగస్వాములు) కంపెనీలకు కుడోస్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా పనిచేస్తోందని దర్యాప్తులో వెల్లడైంది.

పేమెంట్‌ గేట్‌వేలకు ప్రత్యేక మర్చంట్‌ ఐడీలు
kudos non banking finance company : ప్రతీ ఫిన్‌టెక్‌ సంస్థ కోసం ప్రత్యేక పేమెంట్‌ గేట్‌వేతో పాటు మర్చంట్‌ ఐడీని రూపొందించడమే కాకుండా తన ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌నే కుడోస్‌ సమకూర్చింది. అనుమతులు పొందకుండానే ఫిన్‌టెక్‌ సంస్థలు సూక్ష్మ రుణ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాయి. వినియోగదారుల సెల్‌ఫోన్లలోకి, సామాజిక మాధ్యమాల్లోకి అక్రమంగా చొరబడి సేకరించిన సమాచారంతో రుణాలు చెల్లించని వారిపై వేధింపులకు పాల్పడ్డాయి. దీంతో పలువురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఫిన్‌టెక్‌ కంపెనీలు 95 శాతం రికవరీతో ఏడాదిలో భారీగా లబ్ధిపొందాయి. కుడోస్‌ కంపెనీకి రూ.10 కోట్ల నికర యాజమాన్య నిధే ఉన్నా.. రూ.2,224 కోట్లకుపైగా సొమ్మును రుణాల రూపంలో సమీకరించింది. ఈ సొమ్మంతా చైనా అధీనంలోని 39 ఫిన్‌టెక్‌ కంపెనీలకు చెందినదే. ఈ మొత్తం వ్యాపారంలో ఫిన్‌టెక్‌ కంపెనీలు రూ.544 కోట్ల మేర లాభాలు పొందాయి. వీటిలో కుడోస్‌ కంపెనీకి రూ.24 కోట్ల లబ్ధి చేకూరిందని ఈడీ నిర్ధారించింది.

ఇదీ చదవండి:Road Accidents in TS: మద్యం మత్తు.. అతివేగం.. నిర్లక్ష్యం.. 15 మంది దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details