తెలంగాణ

telangana

ETV Bharat / crime

జనగామ జిల్లాలో దారుణం.. కిడ్నాపైన బాలుడు బావిలో శవమై తేలాడు

Kidnap boy floats dead in well: జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రెండురోజుల క్రితం కిడ్నాపైన బాలుడు బావిలో శవమై కనిపించాడు. బాలుడి దగ్గరి బంధువే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లుగా పోలీసులు తెలిపారు. కిడ్నాప్, హత్యకు గల కారణాలను దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నారు.

Kidnap boy
Kidnap boy

By

Published : Sep 20, 2022, 8:13 PM IST

Kidnap boy floats dead in well: జనగామ జిల్లా కొడకండ్లలో రెండ్రోజుల క్రితం కిడ్నాపైన బాలుడి కథ విషాదాంతమైంది. కొడకండ్ల మండల కేంద్రంలో అదృశ్యమైన బాలుడు షాబీర్‌ (4) హత్యకు గురయ్యాడు. వారు నివసిస్తున్న గుడారాల సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో శవమై తేలాడు. బాలుడికి దగ్గరి బంధువైన మహబూబ్‌ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లుగా పోలీసులు తెలిపారు.

బృందాలుగా ఏర్పడి గాలింపు.. తమ కొడుకు కనిపించడం లేదంటూ బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో సోమవారం మహబూబ్‌ పారిపోయాడు. బాలుడిని అతడే కిడ్నాప్‌ చేసి ఉంటాడనే అనుమానంతో మహబూబ్‌పై నిఘా పెట్టిన పోలీసులు ఇవాళ నిందితుడిని సూర్యాపేట జిల్లా మామిడాలపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా బాలుడి మృతదేహాన్ని వ్యవసాయ బావిలో గుర్తించారు. కిడ్నాప్‌, హత్యకు గల కారణాలను దర్యాప్తు అనంతరం పోలీసులు వెల్లడిస్తామన్నారు.

నిందితుడు మహబూబ్

యాదాద్రి భువనగిరి జిల్లా తాజీపూర్‌ గ్రామానికి చెందిన 8 కుటుంబాల వారు గ్రామాల్లో తిరుగుతూ సంచార జీవనం సాగిస్తుంటారు. వారు నెల రోజుల క్రితం కొడకండ్లకు వచ్చి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద గుడారాలు వేసుకున్నారు. కొందరు కట్టెకోత మిల్లులో పని చేస్తుండగా మరికొందరు గుడారాల వద్ద అల్యూమినియం వస్తువులు తయారు చేస్తుంటారు. ఆదివారం ఉదయం 8 గంటలకు బాలుడి తండ్రి జమాల్‌ సూర్యాపేట జిల్లా తిర్మలగిరిలోని కట్టెకోత మిల్లులో పని చేసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్లాడు. ఆ సమయంలో సాబీర్‌ గుడారం బయట ఆడుకుంటున్నాడు. కొద్ది సమయం తర్వాత బాలుడు కనిపించడం లేదంటూ ఆయన భార్య జమీల్‌ ఫోన్‌ చేయడంతో జమాల్‌ వెంటనే వచ్చి బాలుడి కోసం వెతికారు. సాబీర్‌ ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కొంరెల్లి, పాలకుర్తి సీఐ చేరాలు సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. పరిసరాల్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై బాలుడిని కొట్టుకుంటూ తీసుకెళ్లినట్లు వదంతులు రావడంతో సూర్యాపేట జిల్లా వెలిచాల, తిరుమలగిరి ప్రాంతాల్లో గాలించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details