తెలంగాణ

telangana

ETV Bharat / crime

boy suspicious death: పాపం పసివాడు... పండగ వేళ అనుమానాస్పద మృతి - chittoor crime news

దసరా పండగ వేళ ఆనందంగా గడిపేందుకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలుడు.. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడు(boy suspicious death). ఈ విషాద సంఘటనతో.. బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఏపీ చిత్తూరు జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.

kid murder
kid murder

By

Published : Oct 13, 2021, 11:11 PM IST

Updated : Oct 13, 2021, 11:23 PM IST

దసరా పండగ వేళ ఆనందంగా గడిపేందుకు అమ్మమ్మ ఇంటికి వెళ్లిన బాలుడు.. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడు (boy suspicious death). ఈ విషాద సంఘటనతో.. బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. చిత్తూరు జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.

కమ్మంవారిపల్లి మండలం గేరంపల్లి పంచాయతీ సంకేనిగుట్టపల్లికి చెందిన నాగిరెడ్డి దంపతులు కువైట్ లో నివాసం ఉంటున్నారు. తమ కుమారుడు తేజశ్‌ రెడ్డి(8)ని పీలేరులోని బంధువుల ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. కాగా.. దసరా సెలవుల్లో భాగంగా బాలుడు తేజశ్‌ రెడ్డి సోమవారం తన అమ్మమ్మ గ్రామమైన ఎగువమేకలవారి పల్లెకు వెళ్లాడు.

మంగళవారం మధ్యాహ్నం సమయంలో తేజశ్‌ రెడ్డి తన అమ్మమ్మకు చెప్పి ఆడుకునేందుకని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కానీ.. ఎంతసేపటికీ ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు చుట్టుపక్కలంతా వెతికినప్పటికీ.. ఫలితం లేకపోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడి కోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో.. బుధవారం మధ్యాహ్నం గ్రామానికి సమీపంలోని పొలంలో బాలుడు మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

kid murdపాపం పసివాడు... పండగ వేళ అనుమానాస్పద మృతిer

ఇదీ చూడండి:Husband Harassment: భార్య వేలు కట్​ చేసి భర్త పారిపోయాడు.. ఎందుకంటే..?

Last Updated : Oct 13, 2021, 11:23 PM IST

ABOUT THE AUTHOR

...view details