కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంటలో దారుణం చోటు చేసుకుంది. పోలుదసరి కొండయ్య అనే వ్యక్తి నవ మాసాలు మోసిన కన్న తల్లిని అతి కిరాతకంగా కొట్టి చంపాడు. నిందితుడు గత కొంత కాలంగా భార్యా పిల్లలతో దురుసుగా ప్రవర్తిస్తుండటంతో... వారంతా దూరంగా ఉండే రేకుల షెడ్డులో నివసిస్తున్నారు. వీరికి తల్లి పొలుదాసరి హన్నమ్మ తన పింఛన్ డబ్బులను ఖర్చులకు ఇచ్చేది.
గతంలో తండ్రిని చంపాడు.. ఇప్పుడు తల్లిని కూడా.. - telangana news
గతంలో తండ్రిని చంపిన కొడుకే.. ఇప్పుడు తల్లి పట్ల కాలయముడయ్యాడు. అడిగిన డబ్బులు ఇవ్వలేదని అతి కిరాతకంగా కొట్టి చంపాడు. ఈ హృదయవిదారక ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండిలో చోటుచేసుకుంది.
గతంలో తండ్రిని చంపాడు.. ఇప్పుడు తల్లిని కూడా..
ఐదేళ్ల క్రితం తండ్రిని చంపిన కేసులో జైలుకు వెళ్లిన కొండయ్య... పింఛన్ డబ్బులు తనకే ఇవ్వాలని తరచూ తల్లితో గొడవ పడేవాడు. తన భార్యా పిల్లలకు ఇవ్వొద్దని వాదించేవాడు. ఇదే కోపంతో గత రాత్రి దాడి చేయటంతో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కోడలు విజయ ఫిర్యాదు మేరకు... పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:అప్పు తీర్చలేదని స్నేహితుడిపై కత్తితో దాడి