జ్యువెలరీ షాపులో చోరీకి పాల్పడిన దుండగులు రూ. 30లక్షల విలువైన 50 కిలోల ఆభరణాలు ఎత్తుకెళ్లారు (robber in jewellery shop y). ఈఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో (mancherial) జరిగింది. గంగరోడ్డులోని శ్రీవాసవి జ్యువెలరీ షాపు యజమాని ఆదివారం సాయంత్రం 5గంటల సమయంలో దుకాణం మూసి వెళ్లాడు. ఈ రోజు ఉదయం షాపు తెరిచి చూసేసరికి దుకాణం వెనుకవైపు ఉన్న షట్టర్ పగలగొట్టి ఉంది.
షాపులో ఉంచిన 50 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుకాణం చుట్టూ ఉన్న సీసీటీవీ కెమెరాల వైర్లను కట్‌చేసి... ఫుటేజ్ బాక్సులను కూడా దుండగులు అపహరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిని మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్ క్లూస్‌టీంతో వచ్చి పరిశీలించారు.