తెలంగాణ

telangana

ETV Bharat / crime

సర్వీస్​ రివాల్వర్​తో కాల్చుకుని జవాన్​ ఆత్మహత్య - విశాఖలో జవాన్‌ ఇంద్రసింగ్‌ ఆత్మహత్య

ఆంధ్రా - ఒడిశా సరిహద్దు జోలాపుట్‌ వద్ద బీఎస్​ఎఫ్ 15వ బెటాలియన్​లో ఓ జవాన్​ ఆత్మహత్య చేసుకున్నారు. తన సర్వీస్ రివాల్వర్​తో మెడపై కాల్చుకుని బలవన్మరణం చెందాడు.

jawan suicide
jawan suicide

By

Published : Mar 6, 2021, 10:33 PM IST

ఆంధ్రా - ఒడిశా సరిహద్దు జోలాపుట్‌ వద్ద బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్య చేసుకున్నారు. బీఎస్​ఎఫ్​ చెందిన 15వ బెటాలియన్​కు చెందిన ఇంద్రసింగ్ అనే జవాన్ శనివారం ఉదయం విధులు నిర్వహిస్తూ.. తన సర్వీస్ రివాల్వర్​తో మెడపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తోటి జవాన్లు.. సమీపంలో గల లమతపుట్ ఆశాకిరణ్​ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఇంద్రసింగ్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

ఇంద్రసింగ్

సెలవుపై స్వస్థలానికి వెళ్లి వచ్చిన జవాన్..

ఆత్మహత్యకు పాల్పడిన జావాన్ ఇటీవలే నెల రోజుల సెలవుపై స్వస్థలమైన రాజస్థాన్​లోని జానిబడికి వెళ్లి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియలేదు.

ఇదీ చదవండి:రాష్ట్ర సర్కారుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అభినందనలు

ABOUT THE AUTHOR

...view details