తెలంగాణ

telangana

అధికార దుర్వినియోగం... సర్పంచి, ఉప సర్పంచి, కార్యదర్శి సస్పెండ్!

జగిత్యాల జిల్లా జైనా గ్రామ సర్పంచి, ఉప సర్పంచి, కార్యదర్శిలను తాత్కాలికంగా తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికార దుర్వినియోగంతో పాటు ప్రభుత్వ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా వదిలేయడం వల్లే సస్పెండ్ చేసినట్లు నోటీసుల్లో స్పష్టం చేశారు.

By

Published : Mar 5, 2021, 1:49 PM IST

Published : Mar 5, 2021, 1:49 PM IST

jagtial-district-dhramapuri-mandal-jain-village-sarpanch-vice-sarpanch-and-panchayat-secretary-temporarily-suspend-by-collector-ravi
అధికార దుర్వినియోగం... సర్పంచి, ఉప సర్పంచి, కార్యదర్శి సస్పెండ్!

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామ సర్పంచి ప్రభాకర్ రావు, ఉప సర్పంచి కుడిక్యాల మహేశ్, పంచాయతీ కార్యదర్శి పాషాను తాత్కాలికంగా తొలగిస్తూ జిల్లా పాలనాధికారి రవి ఉత్తర్వులు జారీ చేశారు. పల్లె ప్రగతి పనులతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించినందున సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఆడిట్ అభ్యంతరాలపై నోటీసులిచ్చినా... రూ.37,03,865 అభ్యంతర వ్యయంపై జారీ చేసిన షోకాజ్ నోటీసులకు సంజాయిషీ ఇవ్వలేదని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా వదిలేయడంతో పాటు అధికార దుర్వినియోగం చేసినట్లు నోటీసుల్లో ప్రస్తావించారు. పారిశుద్ధ్య నిర్వహణ, పల్లె ప్రగతి పనులను సకాలంలో పూర్తి చేయడంలో విఫలమైనందున పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details