తెలంగాణ

telangana

ETV Bharat / crime

జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర కేసులో వెలుగులోకి ఆసక్తికర విషయాలు..! - కల్లెటి సర్పంచి భర్త ప్రసాద్‌గౌడ్‌

Interesting Facts in Jeevan Reddy's murder conspiracy case
Interesting Facts in Jeevan Reddy's murder conspiracy case

By

Published : Aug 3, 2022, 3:11 PM IST

Updated : Aug 3, 2022, 5:27 PM IST

15:08 August 03

జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

Jeevan Reddy murder conspiracy case: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరణాయుధాలతో జీవన్​రెడ్డి ఇంటికి వచ్చిన ఘటనలో ప్రసాద్‌ గౌడ్‌తో పాటు ఆయన భార్య లావణ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. నిందితుడు ప్రసాద్ గతంలో మావోయిస్టు సానుభూతిపరుడిగా పనిచేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కొన్ని నెలలుగా జీవన్‌రెడ్డిని హత్య చేసేందుకు ప్రసాద్‌ గౌడ్ కుట్రపన్నుతున్నాడని తేలింది. ఇందుకోసం.. బేగంబజార్​లో ఓ కత్తితో పాటు ఎయిర్​పిస్టల్​కు కూడా కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. ఆ దేశవాళీ తుపాకీలో మాత్రం తుటాలు లేవని తెలిసింది.

ఈ నెల ఒకటవ తేదీ రాత్రి 8గంటల సమయంలో బంజారాహిల్స్​లోని రోడ్డు నెంబర్ 12లో ఉన్న జీవన్ రెడ్డి నివాసానికి ప్రసాద్ వెళ్లాడు. కింద గదిలో ఉన్న అంగరక్షకులు భోజనం చేస్తుండగా.. ప్రసాద్​ వాళ్లను కలిశాడు. ఎమ్మెల్యేను కలవడానికి వచ్చినట్లు చెప్పాడు. మొదటి అంతస్తులో వేచి చూడాల్సిందిగా అంగరక్షకులు సూచించారు. ప్రసాద్ మాత్రం అవేవి పట్టించుకోకుండా.. నేరుగా రెండో అంతస్తులో ఉన్న జీవన్​రెడ్డి గదిలోకి వెళ్లాడు. ప్రసాద్​ రాకను గమనించిన జీవన్​రెడ్డి.. "పైకి ఎందుకు వచ్చావు..? కిందికి వెళ్లు... నేను వస్తాను.." అని ప్రసాద్​ గద్దించాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికి కిందికి వచ్చిన ఎమ్మెల్యే జీవన్​రెడ్డి.. ఎందుకు వచ్చావంటూ ప్రసాద్​పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెండింగ్​లో ఉన్న బిల్లుల గురించి వచ్చానని తెలిపిన ప్రసాద్​.. అదే విషయమై ఎమ్మెల్యేతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. గొడవ కాస్త పెద్దది కావటంతో.. ప్రసాద్ చెంపపై జీవన్​రెడ్డి కొట్టాడు. ప్రతిదాడి చేయబోతుంటే వెంటనే వెనక్కి నెట్టేశాడు. ఈ పరిణామంతో... అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రసాద్‌ను పట్టుకున్నారు. తనిఖీ చేయగా.. ప్రసాద్​ జేబులో రెండు తుపాకులు, కత్తి ఉన్నాయి.

వాటిని స్వాధీనం చేసుకొని వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో ప్రసాద్​ను అదుపులోకి తీసుకుని టాస్క్​ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. తూటాలు లేకుండా తుపాకీ పెట్టుకొని ఎమ్మెల్యే ఇంటికి ఎందుకెళ్లాడని పోలీసులు ఆరా తీస్తున్నారు. కొన్ని నెలలుగా ఎమ్మెల్యేను హత్య చేసేందుకు ప్రసాద్ కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీని కోసం అతని స్నేహితుడు సంపత్ కూడా ప్రసాద్​కు సాయం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నెల క్రితం జీవన్​రెడ్డి దిల్లీ వెళ్లిన విషయం తెలుసుకొని ప్రసాద్ కూడా వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు.

సంబంధిత కథనం..

Last Updated : Aug 3, 2022, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details