సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ శివారులోని మల్లారం ఎఫ్‌సీఐ గోదాం చెరువు వద్ద చోటు చేసుకుంది. నగరానికి చెందిన ఇంటర్ విద్యార్థి మరో ఇద్దరు యువకులతో కలిసి చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. వారిలో ఇద్దరు బయటకు రాగా.. లోకేశ్ అనే విద్యార్థికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు.
సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థి.. శవమై తేలాడు.!
ఈత సరదా నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. స్నేహితులతో కలిసి వెళ్లిన ఇంటర్ విద్యార్థి మృత్యు ఒడికి చేరాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ శివారులోని మల్లారం ఎఫ్‌సీఐ గోదాం చెరువు వద్ద జరిగింది.
ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి మృతి
సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సమయం కావడంతో ఆచూకీ తెలియరాలేదు. ఈరోజు ఉదయం రెస్క్యూ టీం మృతదేహాన్ని వెలికితీసింది. పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో లింబాద్రి తెలిపారు. మృతుడు నగరంలోని శివాజీనగర్‌కు చెందినవారిగా పోలీసులు తెలిపారు.