ఉన్నత చదువులు చదవలేక పోతున్నానని ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని శారదా నగర్లో ప్రవల్లిక అనే విద్యార్థిని ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుంది.
మల్కాజిగిరిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - Telangana news
ఉన్నత చదువులు చదవాలని ఆమె కోరిక. కానీ ఆర్థిక ఇబ్బందులు ఆమెని ఆపేశాయి. మనస్తాపం చెందిన ఆ ఇంటర్ విద్యార్థిని చివరికి ఆత్మహత్యకు పాల్పడింది.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత చదువులు చదవలేక పోతున్నాననే మనస్తాపంతో ఉరేసుకుని చనిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:సెంచరీ దొంగకు కేపీహెచ్బీ పోలీసుల అరదండాలు