కరీంనగర్ జిల్లా రేకుర్తిలో ఓ వ్యక్తి.. తన అనుచరులతో దాదాపు 100 తాటి చెట్లను నరికి వేయించాడు. ఈ ఘటనపై అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు నిందితులపై అబ్కారీ అధికారులు.. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు బండి రఘురామ్గా పోలీసులు గుర్తించారు.
రేకుర్తిలో అక్రమంగా 100 తాటిచెట్లు నరికివేత - రేకుర్తిలో అక్రమంగా తాటిచెట్లు నరికివేత
కరీంనగర్ జిల్లా రేకుర్తిలో అక్రమంగా ఓ వ్యక్తి తాటి చెట్లను నరికివేయించాడు. ఘటనపై స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
రేకుర్తిలో 100 తాటిచెట్లు నరికివేత
తాటి చెట్లను అక్రమంగా నరికివేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి:పాతబస్తీలో ఆకతాయిల బీభత్సం.. కత్తులు, తల్వార్లతో వీరంగం