ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలో 130 చలాన్లు ఉన్న ఓ ద్విచక్ర వాహనదారునిపై జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో తనిఖీలు నిర్వహిస్తుండగా వెంకటగిరి వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 2 వైపు వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడిని నిలిపారు. టీఎస్10 ఈఆర్ 7069 నెంబరున్న ఈ వాహనం చలాన్లు తనిఖీ చేశారు. పెండింగ్ చలాన్లు చూసి పోలీసులు అవాక్కయ్యారు. 2017 నుంచి ఇప్పటివరకు 130 చలాన్లు ఉన్నాయని ట్రాఫిక్ ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
పోలీసులు షాక్... ఒకే బైక్‌పై 130 చలాన్లు - telangana news
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీల్లో 130 చలాన్లు పెండింగ్ ఉన్న వాహనం పట్టుబడింది. అవాక్కైన పోలీసులు చలాన్ల మొత్తం రూ.35,950 చెల్లించాలని కోరారు. అంత మెుత్తం డబ్బులు తాను కట్టలేనని వాహనదారుడు నిరాకరించారు. దీంతో హోండా యాక్టివాను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఒకే బైక్‌పై 130 చలాన్లు
అతి వేగం, రాంగ్ పార్కింగ్, శిరస్త్రాణం ధరించకపోవడం వంటి ఉల్లంఘనలున్నాయి. దీంతో ఎస్‌ఐ అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చలాన్ల మొత్తం రూ.35,950 చెల్లించాలని కోరగా వాహనదారు విజయ్ నిరాకరించారు. పోలీసులు హోండా యాక్టివాను స్వాధీనం చేసుకొన్నారు. వాహనదారు మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగి అని ఎస్‌ఐ చెప్పారు.
ఇదీ చదవండి:ATM: కార్డు మరిచారో.. తస్కరించేస్తారు..