తెలంగాణ

telangana

ETV Bharat / crime

TS Drugs Case: డ్రగ్స్ కేసులో రేపు టోనీని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు - పోలీసుల కస్టడీలోకి టోనీ

Drugs Smuggling in Telangana: డ్రగ్స్ కేసులో రేపు టోనీని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. రేపట్నుంచి 5 రోజులపాటు అతనిని ప్రశ్నించనున్నారు. ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశాడో అనే కోణంలో విచారణ చేయనున్నారు. హైదరాబాద్‌లో పలువురు వ్యాపారులకు టోనీ డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించి.. ఏడుగురు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు వ్యాపారులు పరారీలో ఉన్నారు.

Drugs Smuggling in Telangana
టోనీని కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

By

Published : Jan 28, 2022, 12:11 PM IST

Drugs Smuggling in Telangana: హైదరాబాద్‌ పంజాగుట్ట డ్రగ్స్ కేసులో నిందితులైన వ్యాపారుల కస్టడీ కోసం పోలీసులు హైకోర్టును ఆశ్రయించనున్నారు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఏడుగురు వ్యాపారులు, వారి సహాయకులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పలు పార్టీల్లో వ్యాపారులు మాదక ద్రవ్యాలు వినియోగించినట్లు అనుమానాలున్నాయని... వీరితో పాటు ఇంకెవరెవరూ డ్రగ్స్ తీసుకున్నారనే వివరాలు సేకరించాల్సి ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ న్యాయస్థానం మాత్రం.... వ్యాపారులతో పాటు వారి సహాయకులను కస్టడీకి ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో పంజాగుట్ట పోలీసులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నట్లు డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు.

''డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. టోనీని విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయి. రేపు టోనీని కస్టడీలోకి తీసుకుంటాం. పంజాగుట్ట పోలీసు స్టేషన్​లో విచారణ జరుపుతాం. రేపట్నుంచి ఫిబ్రవరి 2 వరకు విచారణ జరిపి.. ఎంతమంది వ్యాపారులు ఉన్నారో తేలుస్తాం. వ్యాపారులను కస్టడీకి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయిస్తాం. పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నాం.''

-జోయల్ డేవిస్, డీసీపీ

మాదకద్రవ్యాల వినియోగం తీవ్రత దృష్ట్యా 9మందిని కస్టడీకి ఇవ్వాలని హైకోర్టును కోరనున్నారు. ప్రధాన నిందితుడు టోనీని పోలీసులు రేపు కస్టడీలోకి తీసుకోనున్నారు. రేపటి నుంచి ఐదు రోజుల పాటు నాంపల్లి కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. మాదక ద్రవ్యాల సరఫరాపై పోలీసులు టోనీని ప్రశ్నించనున్నారు. ఇంకా ఎవరెవరికి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. టోనీ వద్ద మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసే మరో నలుగురు వ్యాపారులు పరారీలో ఉన్నారు.

ఇదీ చూడండి:Drugs Smuggling in Telangana : తెలంగాణలో 'మత్తు' విలయం.. స్మగ్లర్‌ టోనీ అరెస్టుతో కదిలిన డ్రగ్స్ డొంక

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details