Drugs Case: మాదకద్రవ్యాల కేసులో నిందితుడు టోనీని హైదరాబాద్ పోలీసులు ఇవాళ కూడా విచారించనున్నారు. టోనీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు శనివారం పలు అంశాలపై ప్రశ్నించారు. హైదరాబాద్‌తోపాటు ఏయే రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని అడిగారు. హైదరాబాద్‌లో 13 మంది వ్యాపారుల పేర్లను.. టోనీ ఇదివరకే చెప్పగా.. వారికి కాకుండా ఇంకా ఎవరికైనా డ్రగ్స్ విక్రయిస్తున్నాడా అనే వివరాలు తెలుసుకున్నారు.
డ్రగ్స్ కేసు నిందితుడు టోనీని ఇవాళ కూడా విచారించనున్న పోలీసులు - డ్రగ్స్ కేసు తాజా వార్తలు
Drugs Case: మాదకద్రవ్యాల కేసులో నిందితుడు టోనీని నేడు మరోసారి పోలీసులు విచారించనున్నారు. డ్రగ్స్ సరఫరాపై మొదటి రోజు పెద్దగా వివరాలు రాబట్టలేకపోయిన పోలీసులు ఇవాళ్టి విచారణలో కీలక ప్రశ్నలు సంధించనున్నారు.
డ్రగ్స్ కేసు నిందితుడు టోనీని ఇవాళ కూడా విచారించనున్న పోలీసులు
కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చిన టోనీ మిగతా వాటికి మౌనంగా ఉండిపోయాడు. డ్రగ్స్ సరఫరాపై మొదటి రోజు పెద్దగా వివరాలు రాబట్టలేకపోయిన పోలీసులు ఇవాళ్టి విచారణలో కీలక ప్రశ్నలు సంధించనున్నారు. విచారణలో టోనీ చెప్పిన అంశాల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: