నకిలీ మెుబైల్ అప్లికేషన్ల ద్వారా డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నాలుగు కేసుల్లో 8 మందిని పట్టుకున్నట్లు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. కంచన్‌బాగ్, చాంద్రాయణగుట్ట, మీర్‌చౌక్ పరిధిలో జరిగిన మోసాలను బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఛేదించారు.
నకిలీ యాప్‌లతో బీకేర్‌ఫుల్: సీపీ అంజనీ కుమార్
నకిలీ యాప్‌లతో మోసాలకు పాల్పడుతున్న 8మంది ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేసి... డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్టు సీపీ అంజనీ కుమార్ తెలిపారు.
నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీపీ అంజనీ కుమార్
దుకాణాల్లో వస్తువులు కొని... నకిలీ పేటీఎం, గూగుల్ పే అప్లికేషన్ల ద్వారా మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. డబ్బులు దుకాణ యజమాని ఖాతాలో జమకాకుండానే... పేమెంట్ అయినట్లు కనిపించేలా చేశారు. డబ్బులు జమ కాకపోవడం వల్ల మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుల వద్ద రూ. 28 వేలు స్వాధీనం చేసుకున్నట్టు సీపీ వెల్లడించారు.