కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఛైర్మన్ పార్థసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పార్థసారథిని.. నాంపల్లిలోని సీసీఎస్ కార్యాలయానికి తరలించారు. నేడు, రేపు పార్థసారథిని ప్రశ్నించనున్నారు. ఇండస్ ఇండ్ బ్యాంకును మోసం చేసినందుకు పార్థసారథిపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఈ నెల 19న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇండస్ ఇండ్ బ్యాంకులో రూ.137 కోట్ల రుణం తీసుకున్న పార్థసారథి... ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్దంగా పెట్టుబడిదారుల షేర్లను తనఖా పెట్టి బ్యాంకులో రుణం తీసుకున్నారు. ఈ కేసులో మరింత పురోగతి సాధించేందుకు నాంపల్లి న్యాయస్థానం ఆదేశాలతో రెండు రోజుల పాటు పార్థసారథిని ప్రశ్నించనున్నారు.