హైదరాబాద్ హుస్సేని ఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో యువకుడి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇటీవలే బెయిల్‌పై విడుదల అయిన సాలం బిన్త... తనను దొంగతనం కేసులో బహదూర్ పురాకు చెందిన పండ్ల వ్యాపారి సయ్యద్ జుబేరే పోలీసులకు పట్టించాడని, సామాజిక మాధ్యమాల్లో దొంగగా చిత్రీకరిస్తున్నాడని అతనిపై కక్ష్య పెంచుకున్నాడు. అతన్ని హతమార్చేందుకు పథకం వేశాడు.
మద్యం తాగించారు.. మత్తులో ఉండగానే కత్తితో దారుణంగా! - హైదరాబాద్ తాజావార్తలు
హైదరాబాద్ బహదూర్ పురాకు చెందిన పండ్ల వ్యాపారి సయ్యద్ జుబేరే హత్య కేసులో ముగ్గురు నిందితులను హుస్సేని ఆలం పోలీసులు అరెస్టు చేశారు. చోరీ కేసులో పోలీసులకు పట్టించి, సామాజిక మాధ్యమాల్లో దొంగగా చిత్రీకరిస్తున్నాడనే కక్ష్యతోనే అతన్ని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
హత్య కేసును ఛేదించిన హుస్సేని ఆలం పోలీసులు
ఈ నెల 12 వ తేదీన అర్ధరాత్రి జుబేర్‌ను పార్టీ అంటూ షాలిబండాలోని ఓ సినిమా థియేటర్ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న భవనానికి తీసుకెళ్లారు. అక్కడ సాలం బిన్, మహ్మద్ ముజాఫర్ అలీ, తారీఖ్ అలీలు... జుబేర్‌తో కలిసి మద్యం సేవించారు. అనంతరం అతను మద్యం మత్తులో ఉండగా కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!
Last Updated : Jun 16, 2021, 9:51 AM IST