రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పెద్దామంగలరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రాలేదని మనస్తాపంతో చాకలి మల్లేష్ అనే వ్యక్తి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏపీలోని గుంటూరుకు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. భార్యాభర్తలిద్దరూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తారని వెల్లడించారు.
ప్రేమ పెళ్లి.. భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య! - తెలంగాణ వార్తలు
ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రంగారెడ్డి జిల్లా పెద్దామంగలరం గ్రామానికి చెందిన మల్లేష్. పలు కారణాలతో ఆరు నెలలుగా భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు ఒడిగట్టాడు.
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య, వ్యక్తి ఆత్మహత్య
పలు కారణాల వల్ల ఇద్దరూ ఆరు నెలలుగా విడిగా ఉన్నట్లు తెలిపారు. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన ఆ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మొయినాబాద్ పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:లాటరీ పేరుతో లూటీ.. అకౌంట్ నుంచి రూ.20లక్షలు మాయం
Last Updated : May 14, 2021, 9:11 AM IST