Husband Murdered Wife: నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కముంతల్ పహాడ్లో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన భర్త.. డబ్బులివ్వలేదనే కోపంతో భార్యను అతి కిరాతకంగా నరికాడు. మిర్యాలగూడ ఆస్పత్రిలో బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామానికి చెందిన ధర్మారం రుద్రయ్య, రాజేశ్వరి(35) దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి 15 సంవత్సరాలు కాగా.. చిన్న కుమారుడికి పదమూడేళ్లు. కరోనా సోకి ఇటీవల చిన్న కుమారుడు చనిపోయాడు. కొవిడ్ కారణంగా ఉన్న ఊళ్లో పనులు లేకపోవడంతో.. హైదరాబాద్కు వలస వెళ్లారు. అక్కడ అపార్ట్మెంట్లో పనికి కుదిరారు.
మద్యానికి బానిసై..
ఈ క్రమంలో కుమారుడిని కోల్పోయిన బాధలో రుద్రయ్య మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం నిరంతరం భార్యను వేధిస్తూ ఉండేవాడు. భర్త వేధింపులతో రాజేశ్వరి పూర్తిగా విసిగిపోయింది. దీంతో మరోసారి డబ్బులు అడిగినప్పుడు ఇవ్వొద్దని నిర్ణయించుకుంది.