తెలంగాణ

telangana

ETV Bharat / crime

భార్యను హత్య చేసి.. ఆనవాళ్లు చెరిపి.. ఆపై కట్టుకథ - husband killed his wife in vizianagaram

husband killed wife : ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్లు అన్యోన్యంగా గడిపారు. ఎమైందో ఏమో కానీ కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేసి.. ఆనవాళ్లు దొరక్కుండా దహనం చేశాడు. అనంతరం ఆ విషయం మూడో కంటికి తెలియకుండా కాలగర్భంలో కలిపేందుకు.. తన భార్య కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు నిజం వెల్లడైంది. ఈ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగింది.

husband killed wife
husband killed wife

By

Published : Feb 5, 2022, 8:27 AM IST

husband killed his wife : ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం జోడిమెరకలో దారుణం జరిగింది. భార్యను హత్య చేసి.. ఆ విషయం బయటకి తెలియకుండా ఉంచేందుకు దహనం చేశాడు ఓ కిరాతకుడు. ఆపై తన భార్య కనిపించటం లేదని పోలీసులను అశ్రయించాడు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రేమ వివాహం..

జోడిమెరకు చెందిన జోడి నాగరాజు.. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన లక్ష్మి(28)ని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. లక్ష్మి, నాగరాజు దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. గత నెల 30వ తేదీ నుంచి తన భార్య లక్ష్మి కనిపించటం లేదని నాగరాజు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలపాలంటూ పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగాడు.

అనుమానంతో...

నాగరాజు ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు అతనిపై నిఘాపెట్టారు. మరో మహిళతో సన్నిహితంగా ఉంటూ.. లక్ష్మిని హత్య చేసినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో నాగరాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. భార్యను హత్యచేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. హత్యలో ఇతరుల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై విజయనగరం జిల్లాలో తీవ్రఆగ్రహం వ్యక్తమైంది. నాగరాజుని కఠినంగా శిక్షించాలంటూ జోడిమెరకకు చెందిన మహిళలు కొత్తవలసలో ర్యాలీ నిర్వహించారు.

ఇదీచూడండి:Sexual harassment in AP : మతం ముసుగులో లైంగిక వేధింపులు

ABOUT THE AUTHOR

...view details