తెలంగాణ

telangana

ETV Bharat / crime

Gold Seized: లో దుస్తుల్లో బంగారం అక్రమ రవాణా.. ముగ్గురి అరెస్టు - బంగారం సీజ్

హైదరాబాద్​లో భారీస్థాయిలో బంగారం పట్టుబడింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముగ్గురు ప్రయాణికుల వద్ద నుంచి 600 గ్రాములకు పైగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

huge amount of gold seized
భారీస్థాయిలో బంగారం స్వాధీనం

By

Published : Oct 5, 2021, 5:11 AM IST

హైదరాబాద్​లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. లో దుస్తుల్లో అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు వేర్వేరు విమానాల్లో హైదరాబాద్‌ వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి 600 గ్రాములకు పైగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కువైట్‌ నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికులు వేముల శ్రీనివాస్‌, అమర్‌గొండ శ్రీనివాస్‌ల నుంచి రూ.12.31 లక్షలు విలువైన 256 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద 350 గ్రాముల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details