Honor killing in Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీలో జులైౖలో జరిగిన విద్యార్థిని ఆత్మహత్య కేసు సంచలనంగా మారింది. ఐదు నెలల తర్వాత వచ్చిన పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు దీన్ని హత్యగా నిర్ధారించారు. విషయం తెలియడంతో యువతి హత్యకు పాల్పడిన కుటుంబసభ్యులు పరారయ్యారు.
పోలీసుల కథనం మేరకు.. చంద్రగిరికి చెందిన మునిరాజ కుమార్తె మోహనకృష్ణ(19) రెడ్డివారిపల్లి పంచాయతీ ఎస్‌ఎల్‌నగర్‌లోని తన మేనమామ బాలకృష్ణ ఇంట్లో ఉంటూ దూరవిద్యలో ఇంటర్ చదువుతోంది. రామిరెడ్డిపల్లి పంచాయతీ ఆంజనేయపురానికి చెందిన యువకుడు వికాస్‌తో అయిదేళ్లు ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి కులాలు వేరుకావడంతో యువతి ఇంటి వారు పెళ్లికి అంగీకరించలేదు.
ఓ దశలో రెండు కుటుంబాల మధ్య పెళ్లి చర్చలు జరిగాయి. అమ్మాయి తరఫు వారు ఇష్టపడకపోవడంతో 2022 జులై 1న వారిద్దరూ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయారు. అప్పట్లో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. వారి సాయంతో కుటుంబసభ్యులు ప్రేమజంటను పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు.