రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్లో ఓ హిజ్రా హల్చల్ చేసింది. ఓ యువకునిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. గత కొద్ది నెలలుగా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన హిజ్రాలు పట్టణంలో వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో డబ్బులు యాచిస్తూ జీవిస్తున్నారు. కాగా... ఆదివారం రాత్రి పాత బస్టాండ్లో నిద్రిస్తున్న తన జేబులో నుంచి ఆ యువకుడు పోన్ దొంగిలిస్తుండగా దొరకబట్టానని ఓ హిజ్రా ఆరోపించింది.
ఫోన్ దొంగిలించాడంటూ యువకున్ని చితకబాదిన హిజ్రా - hijras in siricilla
తన ఫోన్ దొంగిలించాడంటూ ఓ యువకునిపై హిజ్రా ప్రతాపం చూపించిన ఘటన సిరిసిల్లలో చోటుచేసుకుంది. ఇష్టమొచ్చినట్లు చితకబాది తీవ్రంగా గాయపర్చింది. విచక్షణారహితంగా కొట్టటం వల్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడున్న ప్రయాణికులు బాధితున్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
hijra hulchal in siricilla
తన జేబులో ఉండాల్సిన 8 వేల నగదు మాయమైందని... వాటిని ఆ యువకుడే దొంగిలించాడని ఆరోపిస్తూ బాధితున్ని ఇష్టారీతిన చితకబాదింది. బస్టాండ్ ఆవరణలోని మెట్లపై నుంచి ఈడ్చుకుంటూ వెళ్ళుతూ... బూటుకాలుతో విచక్షణారహితంగా తన్నింది. కర్రతో కొడుతూ.. నానా బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. అక్కడున్న కొంతమంది ప్రయాణికులు 108కు సమాచారమివ్వగా... యువకున్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు.