రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై పౌరసరఫరాల శాఖ అధికారులు నిఘా పెట్టి పట్టుకున్నారు. డీసీఎంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బియ్యాన్ని మెదక్ జిల్లాకు తరలించేందుకు యత్నించారని అధికారులు వెల్లడించారు. డీసీఎం సీజ్ చేసి... డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
రాజేంద్రనగర్‌లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు సీజ్ చేశారు. డీసీఎంను సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చంద్రంగుట్టలో కిలో రూ.10 చొప్పున కొని రూ.15కు కర్ణాటకలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత, రేషన్ బియ్యం పట్టివేత
హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రంగుట్టలో కిలో రూ.10 చొప్పున తీసుకొని రూ.15కు కర్ణాటకలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. డ్రైవర్ ద్వారా పూర్తి సమాచారం సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. 52 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని కిస్మత్‌పూర్‌లోని గోదాంకు తరలించి సీజ్ చేసినట్లు వివరించారు.
- ఇదీ చదవండి :గర్భిణులపై మూడో దశ కరోనా ప్రభావం చాలా తీవ్రం