Hawala money was seized during the munugode by elections: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా డబ్బులు తరలిస్తున్న కారు చిక్కింది. నలుగురు సభ్యుల ముఠా కోటి పది లక్షల రూపాయలు తరలిస్తూ పోలీసులకు దొరికిపోయారు. వారిని ప్రశ్నించగా డబ్బుకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపలేదు. దీంతో హవాలా సొమ్ముగా గుర్తించిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.
మునుగోడు ఉపఎన్నిక వేళ.. రూ.కోటి హవాలా సొమ్ము పట్టివేత - హైదరాబాద్ తాజా వార్తలు
Hawala money was seized in hyderabad: మునుగోడు ఉపఎన్నిక వేళ హైదరాబాద్‌లో మరోసారి భారీగా హవాలా సొమ్ము పట్టుబడింది. జుమ్మేరాత్ బజార్ వద్ద నగదును తరలిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
షాహినాత్‌గంజ్ కు చెందిన కమలేష్, అశోక్ కుమార్, రతన్‌సింగ్ గోషమహల్ ఘాన్సీబజార్ వాసి రాహుల్ అగర్వాల్ కలిసి కారులో ఒక కోటి పది లక్షల డెబై మూడు వేలు తరలిస్తుండగా పోలీసుల వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఈ ముఠా హవాలా సొమ్ము తరలింపు మార్గాన్ని ఎంచుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఎవరి ఆదేశాలతో డబ్బు తరలిస్తున్నారు, ఎక్కడ నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు. ఎవరికి అందజేయాలని ప్రయత్నించారు, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో హవాలా సొమ్ముకు ఏమైనా సంబంధాలున్నాయా, అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నలుగురిని అరెస్టు చేసి కేసు విచారణ జరుపుతున్నారు.
ఇవీ చదవండి: