రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ టీచర్స్‌కాలనీలో సోమవారం సాయంత్రం వివాహితపై గొడ్డలితో దాడి చేసిన రాహుల్ గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన రాహుల్‌గౌడ్‌పై గతేడాది డిసెంబర్ 27న మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు విమల వేధింపుల కేసు పెట్టారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు జనవరి రెండున రిమాండ్ చేశారు.
లైవ్ వీడియో: వివాహితపై గొడ్డలితో దాడి.. నిందితుడి అరెస్ట్.. - gurramguda woman murder case
రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పీఎస్ పరిధిలోని గుర్రంగూడలో సోమవారం ఓ వివాహితపై గొడ్డలితో దాడి చేసిన నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళపై దాడి చేసి ద్విచక్రవాహనంపై పారిపోయిన రాహుల్‌ను మీర్పేట్ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలించారు. ఎట్టకేలకు బుధవారం ఉదయం అతణ్ని అరెస్టు చేశారు.
జైలుకు వెళ్లి వచ్చిన రాహుల్ గౌడ్ విమలపై పగ పెంచుకుని సోమవారం సాయంత్రం గొడ్డలితో విచక్షణా రహితంగా దాడికి దిగాడు. విమల కుడి చేతి వేళ్లతో పాటు... కుడి భుజంపై గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై వచ్చిన నిందితుడు ఒక్క ఉదుటన బాధితురాలిపై గొడ్డలితో విరుచుకుపడ్డాడు. అక్కడే ఉన్న మరో మహిళ భయంతో వణికిపోయారు. దాడిచేసిన కిరాతకుడు ద్విచక్రవాహనంపై పారిపోయాడు.
నిందితుడి కోసం 4 బృందాలుగా ఏర్పడి గాలించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. నిందితుడు దాడికి దిగిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
- సంబంధిత కథనం :జైలుకు పంపిందన్న కక్షతో.. వివాహితపై గొడ్డలి దాడి