సిద్దిపేట జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. తొగుట మండలం రాంపూర్ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. దుబ్బాక మండలం చెల్లాపూర్‌కు చెందిన తిరుపతి - వంశీ అనే ఇద్దరి మధ్య కాల్పులు జరిగాయి. భూవివాదం కారణంతో కాల్పులు జరుపుకున్నట్లు సమాచారం.
సిద్దిపేట జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం - siddipet distrit news
17:08 March 09
సిద్దిపేట జిల్లాలో కాల్పుల కలకలం
జనవరిలోనూ కాల్పులు..
గతంలోనూ సిద్ధిపేటలో కాల్పులు ఘటన చోటుచేసుకొంది. కారు డ్రైవర్‌పై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి రూ.43.50 లక్షలను దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన సిద్దిపేట అర్బన్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జనవరి 31న చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి.
చేర్యాల మండలం దొమ్మాట మాజీ సర్పంచి, సిద్దిపేట నివాసి వకులాభరణం నర్సయ్య స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న 176 గజాల స్థలాన్ని పట్టణంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీధర్‌రెడ్డికి నెలన్నర క్రితం రూ.64.24 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్సుగా రూ.20 లక్షల వరకు చెల్లించారు. మిగిలిన మొత్తం రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చేందుకు పత్రం రాసుకున్నారు. సోమవారం రిజిస్ట్రేషన్‌కు ముందు రూ.43.50 లక్షలను శ్రీధర్‌రెడ్డి ఇచ్చారు. ఆ సొమ్ముతో కూడిన సంచిని నర్సయ్య తన కారులో ఉంచి.. రిజిస్ట్రేషన్ నిమిత్తం కార్యాలయంలోకి వెళ్లారు. అంతలో తలకు టోపీ, ముఖానికి మాస్కులు ధరించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి.. లాక్ వేసి ఉన్న కారు డోరును తెరిచే ప్రయత్నం చేశారు. డ్రైవర్ పరశురాములు అప్రమత్తమై కారును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. వారు డ్రైవర్‌కు కుడివైపు కొంతమేర తెరిచి ఉన్న అద్దంలో నుంచి నాటుతుపాకీతో కాల్పులు జరిపి.. అద్దాన్ని ధ్వంసం చేశారు. అనంతరం డ్రైవర్ పక్కన ఉన్న నగదు సంచి తీసుకుని పరారయ్యారు. నాటుతుపాకీ కారులో పడిపోగా అక్కడే వదిలేశారు.
ఇదీచూడండి:భూమి రిజిస్ట్రేషన్ కోసం వస్తే.. తుపాకీతో బెదిరించి రూ.40 లక్షలు లాక్కెళ్లాడు