ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మాచర్ల మండలం రాయవరంలోమాజీ సైనికుడు దారుణానికి ఒడిగట్టాడు. పొలం తగాదా విషయంలో ఘర్షణ తలెత్తి సాంబశివరావు అనే మాజీ సైనికుడు జరిపిన కాల్పుల్లో.. శివ, బాలకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మెుత్తం 8 రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
former soldier firing: మాజీ సైనికుడి కాల్పులు.. ఇద్దరి మృతి - క్రైమ్ వార్తలు
ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్ల మండలం రాయవరంలో ఓ పొలం వివాదంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో నియంత్రణ కోల్పోయిన ఓ మాజీ సైనికుడు.. కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరు గాయపడ్డారు.
ఘర్షణలో ఇరుపక్షాల మధ్య తలెత్తిన వివాదమే ఘటనకు కారణమని తెలుస్తోంది. మాజీ సైనికుడు సాంబశివరావు తన వద్ద ఉన్న పిస్టోల్ తో దగ్గర నుంచి కాల్పులు జరపడంతో.. శివ, బాలకృష్ణలకు.. తల, శరీర భాగాల్లో నుంచి బుల్లెట్లు దూసుకుపోయాయి. మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే గాయపడిన వారిలో ఇద్దరు చనిపోయారు. ఘటనలో ఆంజనేయులు అనే వ్యక్తికి గాయాలు కాగా, తొలుత మాచర్లకు తరలించగా.. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నారు.
ఇదీ చూడండి: Flipcart: ఫ్లిప్కార్ట్ పార్శిళ్లలో రాళ్లు, పెంకులు... నలుగురు అరెస్ట్