Gunfire in Konaseema:ప్రశాంతంగా ఉండే కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. రవాణాశాఖ కార్యాలయం వద్ద ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల సత్యనారాయణరెడ్డికి చెందిన భవంతి పైకి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. వారిని సత్యనారాయణ రెడ్డి చిన్న కుమారుడు ఆదిత్యరెడ్డి చూసి ప్రశ్నించేలోపే కాల్చేందుకు ప్రయత్నించారని.. దీంతో తీవ్ర పెనుగులాట జరిగిందని ఆదిత్యరెడ్డి చెప్పారు.
ఫైనాన్స్ వ్యాపారిపై కాల్పులు... తప్పించుకునే ప్రయత్నంలో... - Gun fire in Kona Seema
Gunfire in Konaseema ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. ఈ ఘర్షణలో ఇద్దరు దుండగులకు, ఆదిత్యరెడ్డికి గాయాలయ్యాయి. దీనికంతటికీ ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది.
ఫైనాన్స్ వ్యాపారిపై కాల్పులు
దీంతో తుపాకీ ఒకసారి గాల్లోకి పేలింది. తుపాకీలోని బుల్లెట్లు ఉండే మేగజైన్ కింద పడిపోయింది. ఈ ఘర్షణలో ఇద్దరు దుండగులకు, ఆదిత్యరెడ్డికి గాయాలయ్యాయి. దీనికంతటికీ ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది.
ఇవీ చదవండి: